News August 25, 2024
నెల్లూరు వైసీపీ నేతకు కీలక పదవి

నెల్లూరు నేతకు మాజీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలను చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. తాజాగా వైసీపీ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకే జగన్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు టీచర్లు, వైసీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
Similar News
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.
News January 10, 2026
కాకాణి, సోమిరెడ్డి మధ్య ఇరిగేషన్ వార్ !

నువ్వు దోచుకున్నావంటే.. నువ్వే ఎక్కువ దోచుకున్నావంటూ పరస్పరం కాకాణి, సోమిరెడ్డి విమర్శించుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇరిగేషన్ పనుల అవినీతే లేవనెత్తుతున్నారు. కనుపూరు కాలువ, కండలేరు స్పిల్ వే, సర్వేపల్లి కాలువ, చెరువు షట్టర్ పనులపై విమర్శించుకుంటున్నారు తప్పితే.. ప్రజలు కష్టాలను గాలికొదిలేస్తున్నారన్నా అపవాదు నెలకొంది.
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇరకం దీవిలో ఇదే స్పెషల్!

పులికాట్ సరస్సుకు మధ్యలో ఉండే ఇరకం దీవికి వెళ్లాలంటే 8 KM పడవ ప్రయాణం చేయాలి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా కనిపిస్తాయి. చుట్టూ ఉప్పునీరున్నా.. ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత.


