News April 15, 2024
నెల్లూరు సమీపంలో ముగ్గురు మృతి

నెల్లూరుకు సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. శ్రీకాకుళానికి చెందిన రామయ్య(44), తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వచ్చారు. ముగ్గురూ కలిసి ఆదివారం బైకుపై పొదలకూరులో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను బుల్లెట్ వాహనం ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లోనే చనిపోగా తవిటయ్య, సిమ్మయ్య నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు.
Similar News
News March 16, 2025
ఆ టీడీపీ నేతలను కచ్చితంగా జైలుకు పంపుతాం: కాకాణి

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం కొల్లగొట్టిన వారిని వదిలే ప్రశక్తే లేదని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. 2014లో CM చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న ఆయన.. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో దాదాపు రూ.3.5కోట్ల వృక్ష సంపదను టీడీపీ నేతల కొల్లగొట్టారని, వారిని జైలుకు పంపుతామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు.
News March 15, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐఓ ధన్యవాదాలు తెలిపారు.
News March 15, 2025
నెల్లూరు: 174 పరీక్షా కేంద్రాలు.. 33,434 మంది విద్యార్థులు

సంగం జడ్పీ హైస్కూల్‌ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.