News August 27, 2024
నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్‌కు గుండెపోటు

2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఖలీల్ అహ్మద్‌కు గుండెపోటు వచ్చింది. అతనిని హుటాహుటిన నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఖలీల్ కు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఖలీల్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Similar News
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. 16వ స్థానంలో మంత్రి ఆనం

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నెల్లూరు జిల్లా నుంచి మంత్రి ఆనం 16వ స్థానంలో నిలిచారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.
News February 6, 2025
కావలి DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన గుండె మడుగుల బెనర్జీ, ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన కీర్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు కావలిలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నుంచి ప్రాణహాని ఉందని గ్రహించి కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఆశ్రయించారు.