News March 24, 2024

నెల్లూరు: సెలవైనా కరెంట్ బిల్లు కట్టవచ్చు

image

విద్యుత్ బిల్లులను ఆది, సోమవారాల్లో యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా ఎస్ఈ విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ సందర్భంగా సోమవారం సెలవైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పని చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News November 24, 2025

నెల్లూరు మేయర్ భవితవ్యం ఎటు?

image

నెల్లూరు మేయర్ స్రవంతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను పదవి నుంచి దించేందుకు TDP అవిశ్వాస తీర్మానానికి దిగింది. గతంలో MLA కోటంరెడ్డి YCP తరఫున మేయర్‌గా ఉన్న ఆమెను TDPలోకి ఆహ్వానించారు. ఆమె సమ్మతం వ్యక్తం చేసినా ధిక్కార స్వరం ఎదురైంది. దీంతో TDP అప్పట్లో అవిశ్వాసానికి దిగినా కొన్ని నిబంధనల మేరా కుదరలేదు. ప్రస్తుతం ఆ పార్టీ నేతలు కలెక్టర్‌ను కలిసి ఆమెకు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

News November 24, 2025

నెల్లూరు: ZPలో పోస్టులు ఖాళీ.. పాలన అధోగతీ.!

image

ZP(జిల్లాపరిషత్) అంటే అన్నీ శాఖలకు పెద్దన్నలాంటిది. ఇందులో CEO నుంచి స్వీపర్ వరకు 1,247 పోస్టులు ఉండాలి. వీటిలో 929పోస్టులు మాత్రమే భర్తీ కాగా 338 ఖాళీగా ఉన్నాయి. ప్రధానమైన MPDO పోస్టులు 46 ఉండాల్సి ఉండగా 16 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు-133, వాచ్‌మెన్‌లు-98, వాటర్ మెన్‌లు-39 వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే తప్ప పాలన గాడిలో పడదని పలువురు అభిప్రాయడుతున్నారు.

News November 24, 2025

నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

image

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.