News March 24, 2024

నెల్లూరు: సెలవైనా కరెంట్ బిల్లు కట్టవచ్చు

image

విద్యుత్ బిల్లులను ఆది, సోమవారాల్లో యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా ఎస్ఈ విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ సందర్భంగా సోమవారం సెలవైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పని చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News September 7, 2024

నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

image

విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

News September 7, 2024

నెల్లూరు: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నూతన విధానంతో తాము ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అంతవరకు విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.

News September 7, 2024

ముత్తుకూరు: పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శుక్రవారం సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని సర్పంచ్ బూదురు లక్ష్మి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా విచారణ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.