News September 2, 2024

నెల్లూరు: సోమశిలకు భారీ వరద

image

అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం 6 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి, కృష్ణా జలాల నుంచి 19,548 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 38.181 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 550 క్యూసెక్కులు, కండలేరుకు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 152 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.

Similar News

News December 6, 2025

నెల్లూరు: 500 మీటర్లలో.. లెక్కలేనన్ని గోతులు

image

బుచ్చి మున్సిపాలిటీ నడిబొడ్డులో మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై లెక్కలేనన్ని గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డుపై వెళ్లాలంటే కుదుపులకు వాహనాలతోపాటు,ఒళ్లు గుల్లవుతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నా ప్రధాన రహదారుల రూపు మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

News December 6, 2025

నెల్లూరు: చక్కెర కోటాకు “కత్తెర”..!

image

జిల్లాలో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు 1/2 కేజీ చొప్పున ఇస్తున్న చక్కెర కోటాలో ఈ నెల కత్తెర పడింది. పలుచోట్ల చక్కెరను లేదంటూ.. డీలర్లు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో 1513 రేషన్ షాపుల పరిధిలో 7 లక్షల కార్డులు ఉండగా.. వీరికి ప్రతీ నెల 3500 మెట్రిక్ టన్నులు చక్కెర సరఫరా జరుగుతోంది. అయితే నెల స్టార్ట్ అయి 5 రోజులు గడుస్తున్నా.. కొన్ని చోట్ల ఇవ్వడం లేదు.

News December 6, 2025

నెల్లూరు: పెన్నా నదిలోకి దూకి మహిళ సూసైడ్

image

నెల్లూరులోని పెన్నా బ్రిడ్జి మీద నుంచి గుర్తు తెలియని మహిళ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలియక పోవడంతో వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన నవాబ్ పేట పోలీసులు ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.