News December 12, 2024

నెల్లూరు: సౌదీలో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు 

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు సౌదీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులు 18-40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి, ఏదైనా ఆస్పత్రిలో 18 నెలలు పని చేసిన అనుభవం ఉండాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.78- రూ.89 వేలు వేతనం లభిస్తుందన్నారు.

Similar News

News December 2, 2025

నెల్లూరు: అసాంఘిక శక్తుల నివారణకు SP కార్యాచరణ

image

నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఈ దూరాన్ని తగ్గించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకొస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే.. 112 కి, ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు గంజాయి, సైబర్ నేరాలు, ఇసుక అక్రమ రవాణా వంటి ఇతరత్రా నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.

News December 2, 2025

నెల్లూరు: దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు

image

దుబాయ్‌లో హోమ్ కేర్ నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ కయ్యం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సంవత్సరాల లోపు ఉండి BSc నర్సింగ్ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఈ ఉద్యోగ అవకాశం రెండేళ్లు కాంటాక్ట్ ప్రాతిపదికన ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News December 2, 2025

నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

image

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్‌తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్‌లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.