News November 9, 2024

నెల్లూరు: స్కూళ్లకు నేటి సెలవు రద్దు

image

సాధారణంగా రెండో శనివారం(second satur day) సెలవు ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో నేడు అన్ని స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. అన్ని స్కూళ్లు నేడు యథావిధిగా నడుస్తాయి. ఇటీవల భారీ వర్షాలకు వరుస సెలవులు ప్రకటించారు. ఈక్రమంలో నేటి సెలవును వర్కింగ్ డేగా మార్చారు. మరోవైపు తిరుపతి జిల్లాలోని పాఠశాలలకు సైతం హాలీ డే రద్దు చేశారు.

Similar News

News December 5, 2024

నెల్లూరు జిల్లాలో విషాదం

image

పొట్టకూటి కోసం ఊరుగాని ఊరికి వచ్చి కానరాని లోకానికి చేరిన విషాద ఘటన డక్కిలి మండలం శ్రీపురంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామానికి చెందిన జంపాని వెంకటేశ్వరమ్మ వర్షంలో వరినాట్లు వేస్తుండగా పిడుగు పడి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్వరమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ, ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు.

News December 5, 2024

సోమశిల జలాశయానికి భారీ వరద

image

సోమశిల జలాశయంలో 71.451 టీఎంసీల నీటిమట్టం నమోదైనట్లు జలాశయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పెరుగుతూ 13,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యానికి మరో ఆరు టీఎంసీల నుంచి ఏడు టీఎంసీల వరకు కావలసి ఉంది. జలాశయం నుంచి కండలేరు వరద కాలువ ద్వారా కండలేరుకు 2000 క్యూసెక్కులు, స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు.

News December 4, 2024

అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ

image

అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.