News May 24, 2024
నెల్లూరు: హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

బాపట్లలో ఈ నెల 15న జరిగిన ప్రశాంత్ హత్యకేసులో నెల్లూరుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ప్రశాంత్ బాపట్ల పాత బస్టాండ్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డితో పాటు ఆర్.లక్ష్మయ్య, ద్వారకా, చెర్ల లక్ష్మణ్, పంగా రోహిత్, కొమరిక ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 14, 2025
ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.
News February 13, 2025
నెల్లూరు: ప్రణతికి డాక్టరేట్ ప్రదానం

రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ.ప్రణతి కి గురువారం డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో పట్టణ మరియు స్థానిక రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా సెస్ డీన్, ఆచార్యులు, ఇతర అధ్యాపక బృందం పరిశోధకురాలికి అభినందనలు తెలిపారు.
News February 13, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్‌పోస్ట్‌ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.