News December 19, 2024

నెల్లూరు: హామీలు అమలుపై ఎమ్మెల్యేకు ఆయన కుమారుడు వినతి

image

ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌కు ఆయన తనయుడు కాకర్ల సంహిత్ వినతి పత్రం అందించారు. అమెరికాలో చదువుతూ నియోజకవర్గానికి వచ్చిన సంహిత్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, గుర్తించిన సమస్యలపై వినతి పత్రం అందించారు. ఎన్నికల ప్రచారంలో తనదృష్టికి వచ్చిన సమస్యలపై ఆయనకు వినతిపత్రంలో అందజేసి పరిష్కరించాలని కోరారు. ఆయన చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 22, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

News October 22, 2025

పెంచలకోన వాటర్‌ఫాల్స్‌కు రాకండి: ఎస్ఐ

image

భారీ వర్షాల నేపథ్యంలో రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పెంచలకోన ఆలయ సమీపంలో ఉన్న వాటర్‌ఫాల్స్‌కు వర్షపు నీరు భారీగా వస్తోందని చెప్పారు. ప్రజలు ఎవరూ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని కోరారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్ ఫాల్స్ వద్దకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

News October 22, 2025

నెల్లూరు: కాలేజీలకు సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని జూనియర్ కాలేజీలకు సైతం బుధవారం హాలిడే ఇవ్వాలని RIO వరప్రసాద్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.