News December 19, 2024

నెల్లూరు: హామీలు అమలుపై ఎమ్మెల్యేకు ఆయన కుమారుడు వినతి

image

ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌కు ఆయన తనయుడు కాకర్ల సంహిత్ వినతి పత్రం అందించారు. అమెరికాలో చదువుతూ నియోజకవర్గానికి వచ్చిన సంహిత్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, గుర్తించిన సమస్యలపై వినతి పత్రం అందించారు. ఎన్నికల ప్రచారంలో తనదృష్టికి వచ్చిన సమస్యలపై ఆయనకు వినతిపత్రంలో అందజేసి పరిష్కరించాలని కోరారు. ఆయన చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ

image

ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు, గాంధీ బొమ్మకు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీలలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

News January 18, 2025

నెల్లూరుకు నీరు రావడం NTR పుణ్యమే: సోమిరెడ్డి

image

తెలుగుగంగ ప్రాజెక్టును రూపొందించి నెల్లూరు నేలను కృష్ణా జలాలతో తడిపిన ఘనత నందమూరి తారక రామారావుదేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలోనే ఏ జిల్లాకు లేని విధంగా నెల్లూరుకు 146 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం ఎన్టీఆర్ పుణ్యమేనన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్‌తో అప్పట్లో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.

News January 18, 2025

నెల్లూరు: ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇవి మిస్ కాకండి

image

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్‌లో అసలు మిస్ అవ్వకూడని ప్రదేశాలు ఏంటో ఓ లుక్ వేద్దాం.
☛సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి
☛ మన్నారుపోలూరు కృష్ణ స్వామి గుడి
☛ శ్రీహరికోట రాకెట్ కేంద్రం
☛ నర్సమాంబపురంలో ఎర్రకాళ్ల కొంగలు
☛ పులికాట్‌ ఫ్లెమింగోలు
☛భీములవారిపాళెం-ఇరకందీవి పడవ ప్రయాణం