News March 31, 2024
నెల్లూరు: హైకోర్టు జడ్జీలను కలిసిన కమిషనర్
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జయసూర్య, హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డిని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్‌లో జిల్లా న్యాయ అధికారుల వర్క్ షాష్‌కు న్యాయమూర్తులు హాజరయ్యారు.
Similar News
News January 10, 2025
ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం.. 10th Class విద్యార్థి మృతి
ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. బైక్‌పై ఆత్మకూరుకు వెళ్తున్న జశ్వంత్‌ను అప్పారావుపాలెం నుంచి ఇసుకలోడుతో ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కింద పడి ఘటనా స్థలంలోనే జశ్వంత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
News January 9, 2025
రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనవద్దు: కలెక్టర్
రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు.
News January 8, 2025
జాతీయ కుష్టు వ్యాధి నివారణ పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆనంద్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నివారణకు మరింత ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.