News March 6, 2025
నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: ZPలో పోస్టులు ఖాళీ.. పాలన అధోగతీ.!

ZP(జిల్లాపరిషత్) అంటే అన్నీ శాఖలకు పెద్దన్నలాంటిది. ఇందులో CEO నుంచి స్వీపర్ వరకు 1,247 పోస్టులు ఉండాలి. వీటిలో 929పోస్టులు మాత్రమే భర్తీ కాగా 338 ఖాళీగా ఉన్నాయి. ప్రధానమైన MPDO పోస్టులు 46 ఉండాల్సి ఉండగా 16 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు-133, వాచ్మెన్లు-98, వాటర్ మెన్లు-39 వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే తప్ప పాలన గాడిలో పడదని పలువురు అభిప్రాయడుతున్నారు.
News November 23, 2025
నెల్లూరు: కరెంట్ సమస్యలా.. ఈ నం.కు కాల్ చేయండి.!

నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ APPSDCL కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10-12 గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ విద్యుత్ సమస్యలపై 8977716661కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 23, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.


