News March 6, 2025

నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

image

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్‌, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.

Similar News

News April 11, 2026

నెల్లూరు: నేటి నుంచి చేపల వేట బంద్

image

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

News April 11, 2026

నేర నియంత్రణే లక్ష్యం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.