News December 25, 2024

నెల్లూరు: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని DEO డాక్టర్ బాలాజీ రావు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు తత్కాల్ కింద రూ.1000 ఫైన్‌తో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.

Similar News

News December 9, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

News December 9, 2025

నెల్లూరు: కాలువలో డెడ్ బాడీ కలకలం

image

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పరిధిలోని బుడ్డి డ్రైన్ సమీపంలో ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. పంటకాలువలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన 45 సంవత్సరాల పురుషుడు మృతదేహంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 9, 2025

జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

image

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.