News March 11, 2025

నెల్లూరు: 12మంది అడ్మిన్లకు షోకాజ్ నోటీసులు జారీ

image

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 12 మందికి రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కమిషనర్ సూర్య తేజ షోకాజ్ నోటీసులను సోమవారం జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు ఈ నెల చివరి నాటికి కరెంట్ డిమాండ్ 100%, అరియర్ డిమాండ్ 75% పూర్తి చేయాలని నిర్దేశించారని తెలిపారు.

Similar News

News April 17, 2026

NLR: పెట్రోల్ బంకుల్లో ఈ సేవల గురించి తెలుసా?

image

ప్రతి పెట్రోల్ బంక్‌లో వినియోగదారులకు చాలా సేవలు అందుతాయనే విషయమే తెలియదు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. అత్యవసరమైతే ఫోన్ కాల్ వినియోగించుకోవచ్చు. బంకులో పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణను పరిశీలించవచ్చు. వాహనాల టైర్లకు గాలి ఉచితంగా పొందవచ్చు. బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కంపల్సరీగా ఉండాలి. సేవలు కల్పించకపోతే 1800-11-4000కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నెల్లూరు: హైస్పీడ్ బోట్ల కొనుగోలుకు ఆమోదం

image

సముద్రంలో గస్తీ కోసం 2 హైస్పీడ్ యాంత్రిక బోట్ల కొనుగోలుకు నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు ఆమోదం తెలిపినట్లు జేడీ శాంతకుమారి తెలిపారు. 2బోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా గస్తీ నిమిత్తం ప్రభుత్వం రూ.120 లక్షలు పూర్తి రాయితీతో అందిస్తుందన్నారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను రాష్ట్రకమిటీ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. 3నెలల్లో వీటిని అందిస్తామన్నారు.