News August 3, 2024
నెల్లూరు: 12 మంది డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు
నెల్లూరు జిల్లాలో 12మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లను తిరుపతి జిల్లాకు కేటాయించగా, మరో 9మందిని నెల్లూరు జిల్లాకు కేటాయించారు. వారు సంబంధిత జిల్లా కలెక్టర్ వద్ద రిపోర్టు చేసి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News September 18, 2024
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పరిషత్ ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆనంద్, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డులకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టేమన్నారు.
News September 18, 2024
నెల్లూరు: చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
News September 18, 2024
సంగం: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ఏఎస్ పేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ సంగం మండలం పడమటిపాలెంలో మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బుచ్చి నుంచి నెల్లూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ స్వగ్రామం విడవలూరు.