News January 18, 2025

నెల్లూరు: 17 రోజుల్లో పది మంది మృతి

image

నెల్లూరు జిల్లాలో గడచిన 17 రోజుల్లో వివిధ కారణాలతో పదిమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమ విఫలమై, కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి, కొంతమంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా చిన్న చిన్న సమస్యలకే తనువు చాలించడం సరైంది కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక దృఢత్వం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?

News November 7, 2025

నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

image

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్‌లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.

News November 6, 2025

రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.