News June 18, 2024

నెల్లూరు: 2 నెలలు కాపురం చేసి పరార్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట(M) విద్యానగర్‌కు చెందిన నిహారిక అనే యువతి మోసపోయింది. ఇన్‌స్టాగ్రాం పరిచయంతో గద్వాల్ జిల్లాకు చెందిన బషీర్‌తో ఆమె కొద్ది రోజులు సహజీవనం చేసింది. తనకు విడాకులై ఇద్దరు పిల్లలు ఉన్నారని నిహారిక చెప్పినా మార్చి 18న బషీర్ తాళి కట్టాడు. 2 నెలలు కాపురం చేసి పారిపోయాడు. బక్రీద్ కావడంతో అతను సొంత ఇంటికి వస్తాడని నిహారిక నిన్న బషీర్ ఊరికి వెళ్లగా అతను దాడి చేసి తరిమేశాడు.

Similar News

News December 4, 2025

పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

image

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్‌లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.

News December 4, 2025

పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

image

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.