News April 2, 2025

నెల్లూరు : 3 నుంచి పది మూల్యాంకనం

image

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నగరంలోని దర్గామిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈవో బాలాజీ రావు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేపడుతున్నారని, సిబ్బంది నియామకాలను కూడా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 2 వతేదీ సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులకు, సిబ్బందికి విధులు కేటాయిస్తామన్నారు.

Similar News

News April 5, 2025

నెల్లూరులో ముగిసిన ఇంటర్ మూల్యాంకనం

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం(కరెక్షన్) శుక్రవారంతో ముగిసిందని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 1200 మంది లెక్చరర్లు, 150 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. 3.54 లక్షల పేపర్లు దిద్దామని చెప్పారు. ఈ వివరాలను స్కానింగ్ చేసి ఇంటర్ బోర్డుకు పంపామన్నారు.

News April 5, 2025

నెల్లూరు: 10 చలివేంద్రాలు ప్రారంభం

image

నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందులు డీలర్లు అసోసియేషన్ సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు గాంధీ బొమ్మ కూడలి, మనుబోలు, దగదర్తి, కావలి, అల్లూరు, వింజమూరు, టీపీ గూడూరు, పొదలకూరు, కందుకూరు, ఆత్మకూరు మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి పుట్టా సత్యవాణి తెలిపారు.

News April 4, 2025

వైసీపీ నేతలను జైలుకు పంపడమే వారి లక్ష్యం: మేరిగ 

image

రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్యాయంగా, అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. ఎంతో సౌమ్యుడిగా, మంచి పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం దారుణమన్నారు.

error: Content is protected !!