News August 2, 2024
నెల్లూరు: 4న జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఈ నెల 4వ తేదీన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి విజయశంకర్ రెడ్డి, రమేశ్ బాబు తెలిపారు. ఈ పోటీల్లో రాణించిన వారిని సెప్టెంబర్ 13న తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.
Similar News
News March 8, 2025
నెల్లూరు: ఘోరం.. బాధల్లో ఉన్నా దోచేశాడు

సమాజం సిగ్గుతో తలిదించుకునే ఘటన ఇది. రాపూరు(మ) తెగచెర్లకు చెందిన ఇద్దరు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓ దుండగుడు CMO నుంచి వచ్చానని కలెక్టర్తో అన్ని విషయాలు మాట్లాడానని వారిని నమ్మించాడు. మీ పిల్లలను ఇండియాకు రప్పించేందుకు ఖర్చు అవుతుందని వారి నుంచి రూ.50వేలు దోచేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 8, 2025
బీదను మరోసారి అదృష్టం వరించేనా

టీడీపీలో కీలకనేతగా కొనసాగుతున్న బీద రవిచంద్ర ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్సీపై అధినేత నుంచి హామీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీద అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. రవిచంద్ర గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.
News March 8, 2025
చికెన్ టేస్ట్ చేసిన నెల్లూరు కలెక్టర్

నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.