News March 20, 2024
నెల్లూరు: 420కి పైగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,470 కేంద్రాలను పరిశీలించామన్నారు. ఇందులో 420కు పైగా క్రిటికల్ సెంటర్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 13, 2025
నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అజిత వేజెండ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News September 13, 2025
నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి మైథిలి కళ్లు దానం

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.
News September 13, 2025
ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలు

ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం సృష్ఠించాయి. పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. శుక్రవారం స్కూల్లో అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు చికిత్స అందించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల విద్యార్థినులకు విషజ్వరాలు రావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. స్కూల్ వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.