News March 20, 2024

నెల్లూరు: 420కి పైగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు

image

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,470 కేంద్రాలను పరిశీలించామన్నారు. ఇందులో 420కు పైగా క్రిటికల్ సెంటర్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News September 14, 2024

మాజీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

image

మాజీ సీఎం జగన్‌‌కి సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయవాడకు వచ్చిన వరదలపై జగన్ విమర్శిస్తున్న తీరును తప్పుబట్టారు. విపత్తులు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అయితే , రూ. లక్షల కోట్లు దాచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

News September 14, 2024

నెల్లూరు: ఈనెల 20న మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి. విజయవినీల్ కుమార్ తెలిపారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 – 2 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10,ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు.

News September 14, 2024

సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం

image

సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.