News January 3, 2025
నెల్లూరు: 44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గుంటూరు జోన్ పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నెల్లూరు DMHO V.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జోన్ పరిధిలో మొత్తం 44 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 సా.5 గంటల లోగా http://cfw.ap.nic.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 5, 2025
రామయ్యపట్నం గురించి రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ బీద
రామయ్యపట్నం లో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో మంగళవారం ఎంపీ బీద మస్తాన్ రావు ప్రశ్నించారు. దీనికి కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిస్తూ ప్రాజెక్టు వ్యయం 96,862 కోట్ల రూపాయలని, ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 6000 ఎకరాల భూమిలో నెల్లూరు జిల్లా రామయ్యపట్నం ఓడరేవులు గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు అంగీకరించబడింది తెలిపారు
News February 5, 2025
నెల్లూరు యువకుడికి సీఎం చంద్రబాబు ప్రశంస
ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మెరిసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించిన కర్రి సాయి పవన్ (రాజమండ్రి), షేక్ గౌస్ (నెల్లూరు), కానోస్లాలోమ్ C1 మహిళల విభాగంలో కాంస్యం సాధించిన దొడ్డి చేతన భగవతికి (ఏలూరు) ఆయన అభినందనలు తెలిపారు. వారి విజయాల పట్ల గర్వంగా ఉందని CM సంతోషం వ్యక్తం చేశారు.
News February 5, 2025
లోక్‌సభలో నెల్లూరు ఎంపీ ఏంమాట్లాడారంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు పలు అంశాలపై ఆయన లోక్‌సభలో ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.