News September 2, 2024
నెల్లూరు: 7న మద్యం దుకాణాల బంద్

నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వారు మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 18, 2025
వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.
News September 18, 2025
నెల్లూరు: చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు..!

నెల్లూరు జిల్లాలో కొందరు నిషేధిత క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. వీటికి కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతూ ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 21,629 చెరువుల్లో అనుమతులతో చేపలు పెంచుతున్నారు. మరో 5వేల ఎకరాల్లో అక్రమంగా ఆక్వా సాగు ఉన్నట్లు అంచనా. అల్లూరు, బుచ్చి, సంగం, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్ పరిధిలో వ్యర్థాల వాడకం ఎక్కువగా ఉంటోంది.
News September 18, 2025
నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.