News April 3, 2024

నెల్లూరు: 8వ తేదీ వరకు పింఛన్లు

image

గ్రామ, వార్డు సచివాలయాల్లో బుధవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. 8వ తేదీ వరకు నగదు అందజేస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,19,961 మంది లబ్ధిదారులుండగా.. వీరికి 95.77 కోట్ల నగదు పంపిణీ చేస్తారు. అనారోగ్యంతో తిరగలేని వారి వద్దకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి నగదు అందజేయనున్నారు. పెన్షన్ల పంపిణీకి ఒక్కో సచివాలయంలో 5 నుంచి 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Similar News

News March 8, 2026

నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

image

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News March 8, 2026

అబ్దుల్‌ అజీజ్‌ తల్లి మృతి.. MP నివాళి

image

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్‌ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్‌ అజీజ్‌ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

News March 7, 2026

అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

image

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.