News March 7, 2025

నెల్లూరు: DSC అభ్యర్థులకు GOOD NEWS

image

రానున్న మెగా DSC పరీక్షకు ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా BC వెల్ఫేర్ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు, బీసీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసువాలని తెలిపారు. ఇతర వివరాలకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.

Similar News

News April 22, 2025

నెల్లూరులో ఇద్దరి ఆత్మహత్య

image

నెల్లూరు జిల్లాలో సోమవారం వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని న్యూ ఎల్బీ కాలనీలో మేస్త్రీ వెంకటేశ్ (42) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విడవలూరులోని గొళ్లపాళేనికి చెందిన నాగార్జున స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

News April 22, 2025

నెల్లూరు: నూతన డీఐఈవోగా ఓ సుబ్బారావు నియామకం

image

నెల్లూరు జిల్లా నూతన డీఐఈవోగా ఓ సుబ్బారావు నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న అధికారి డాక్టర్ ఆదూరు శ్రీనివాసులును చిత్తూరు జిల్లా డీఐఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  నెల్లూరు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి పనిచేస్తున్న మధుబాబును ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

News April 22, 2025

పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.

error: Content is protected !!