News November 13, 2024
నెల్లూరు: DSC పరీక్షలకు ఉచిత శిక్షణ
ఏపీ బీసీ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు DSC పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి కే ప్రసూన ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ BC, SC,ST, EBC అభ్యర్థులు అర్హులన్నారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రు.లక్ష లోపు ఉండి, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు BC స్టడీ సర్కిల్‌లో 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 9, 2024
నెల్లూరు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
News December 8, 2024
మనుబోలు హైవేపై లారీ బోల్తా
మనుబోలు మండలంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళుతున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
News December 8, 2024
రోడ్డు ప్రమాదంలో నలుగురు సిరిపురం వాసులు స్పాడ్ డెడ్
పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో చనిపోయింది కావలి మండలం సిరిపురం వాసులుగా సమాచారం. వారు కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తుళ్లూరి సురేష్, వనిత, యోగిలు, వెంకటేశ్లర్లుగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.