News April 29, 2024

నెల్లూరు: EVMలో ఎవరి పేర్లు ఉంటాయో?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో తుది పోరులో ఎవరు నిలుస్తారనేది ఇవాళ తేలనుంది. గూడూరులో 15, వెంకటగిరిలో 20, సూళ్లూరుపేటలో 23, సర్వేపల్లిలో 17, నెల్లూరు సిటీలో 27, రూరల్‌లో 24, కోవూరులో 32, కావలిలో 25, ఆత్మకూరులో 23, ఉదయగిరిలో 29 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నెల్లూరు ఎంపీ స్థానానికి 28 నామినేషన్లకు ఆమోదం లభించింది. ఇవాళ సాయంత్రంలోగా EVMలో ఎవరి పేర్లు ఉంటాయో తెలిసిపోతుంది.

Similar News

News July 8, 2025

నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

image

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?

News July 8, 2025

ఆ దాడికి మాకు సంబంధం లేదు: ప్రశాంతిరెడ్డి

image

మహిళ అని చూడకుండా నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్నను ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సమర్ధించడం సరికాదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ‘ప్రసన్నపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా. ఆయన నివాసంపై జరిగిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన నీచుడు ప్రసన్న’ అని ఆమె మండిపడ్డారు

News July 7, 2025

అనామకులతో అప్రమత్తంగా ఉండాలి: SP

image

మీ రక్షణే మా భద్రతగా నెల్లూరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగలో పోలీసు బందోబస్తు, గంధ మహోత్సవానికి చేసిన ఏర్పాట్లను ఆయన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రికి జరగనున్న ప్రధాన ఘట్టం అయిన గంధ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనామకులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.