News July 27, 2024
నెల్లూరు KNR స్కూల్ లో తప్పు ఎవరిది?
నెల్లూరు స్కూల్ లో గోడ కూలి మహేంద్ర మృతి చెందిన ఈ ఘటనలో తప్పు ఎవరిది? నాడు-నేడు పనులను నాసిరకంగా చేపట్టడం తోపాటు నిధులు ఇవ్వక అర్ధంతరంగా పనులు ఆపించిన గత ప్రభుత్వ పాలకులదా? సగం పనులు జరిగిన భవనం వద్దకు పిల్లలను వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించిన ఉపాధ్యాయులదా!? ఇలా తప్పు ఎవరిదైనా ఆ తల్లికి మాత్రం పుత్రశోకం మిగిల్చింది. ఈ నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు కోరాయి.
Similar News
News November 5, 2024
కాకాణితో సమావేశమైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్
నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నివాసంలో గురువారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. వారు పలు అంశాలపై చర్చించారు. కాకాణి గోవర్దన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జిల్లాలోనే పలువురు నాయకులు పాల్గొన్నారు.
News November 5, 2024
హైకోర్టులో కాకాణి పిటిషన్
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఇటీవల టీడీపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంకటాచలం, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై ఇవాళ జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణ చేపట్టనున్నారు.
News November 5, 2024
8న వెంకటాచలంలో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే
సర్వేపల్లి నియోజకవర్గం చెముడు గుంటలోని శిరిడిస్ కళ్యాణ మండపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీల కోసం శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటచలం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత ఆయన అర్జీదారుల నుంచి 550 పైగా అర్జీలు స్వీకరించారు.