News April 9, 2024
నెల్లూరు MP అభ్యర్థిగా రాజు

కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు పేరు ఖరారైంది. గతంలో ఆయన జాతీయ ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్‌గా పని చేశారు. రాహుల్ గాంధీ అంతరంగికుడిగా కీలకంగా వ్యవహరించారు. దీంతో నెల్లూరు ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు.
Similar News
News March 8, 2026
నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
News March 8, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. MP నివాళి

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
News March 7, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.


