News August 5, 2024
నెల్లూరు: OBC సంక్షేమ కమిటీకి బీద మస్తాన్ రావు ఎన్నిక
ఇతర వెనుకబడిన తరగతుల (OBCs)సంక్షేమ పార్లమెంటు కమిటీకి జరిగిన ఎన్నికలలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. సోమవారం రాజ్యసభ పార్లమెంటరీ బుల్లెట్ అధికారికంగా ధ్రువీకరించిందని బీదా మస్తాన్ రావు తెలిపారు. మొదటి సిట్టింగ్ తేదీ నుంచి ఒక సంవత్సరం ఈ కమిటీలో సభ్యత్వం ఉంటుందన్నారు. బీద మస్తాన్ రావుతోపాటుగా 9 మంది పార్లమెంటు సభ్యులు కూడా ఈ కమిటీకి ఎంపికయ్యారు.
Similar News
News October 12, 2024
సూళ్లూరుపేట: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు!
కవరైపెట్టె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్(12578) ఢీకొనడం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉన్నట్లు భారతీయ రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)తో విచారణ చేయించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలుస్తాయని దక్షణమధ్య రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ తెలిపారు. తిరవళ్లూరు వద్ద పనులు చేపట్టి రైళ్ల రాకపోకలు పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామన్నారు.
News October 12, 2024
నెల్లూరు జిల్లాలో మద్యం షాపులకు 3,833 దరఖాస్తులు
నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల కోసం గడువు ముగిసే సమయానికి 3,833 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు అధికారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కాగా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.76.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు వారు వెల్లడించారు.
News October 12, 2024
వింజమూరు: రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగి మృతి
వింజమూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉదయగిరికి చెందిన APGB బ్యాంక్ ఉద్యోగి షేక్ ఖాజా రహంతుల్లా చనిపోయాడు. చాకలికొండలోని APGB బ్యాంకులో విధులు ముగించుకొని వస్తుండగా మార్గమధ్యలో గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.