News April 5, 2025

నెల క్రితం పెళ్లి.. వివాహిత ఆత్మహత్య!

image

కదిరి మండలం బోయరామన్నగారిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ (18) అనే యువతి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. యువతి 45 రోజుల క్రితం కూటాగుళ్ల చెందిన చిన్న అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఆమె ప్రయుడిని పెళ్లాడింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడలేదని మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Similar News

News April 6, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెంట్లవెల్లి వాసి గార్డుల లేవన్న(45) పనిమీద పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌కి వెళ్లాడు. తిరిగొస్తుండగా శనివారం రాత్రి కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్లో వెళ్లి బైక్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

News April 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు GOOD NEWS

image

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారి నెంబర్-167 ప్రధాన రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొత్తం రూ.706.08 కోట్ల వ్యయంతో 108 కిలోమీటర్ల రహదారిని మహబూబ్‌నగర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్నారు.

News April 6, 2025

గద్వాలలో ఉప ఎన్నికలు: KCR

image

గద్వాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయని.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించినట్లు BRS గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసుల హనుమంతు నాయుడు అన్నారు. శనివారం KCR అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు హనుమంతు నాయుడు తెలిపారు. 

error: Content is protected !!