News April 5, 2025
నేంద్యాల జిల్లాలో నేటి ముఖ్యవార్తలు

☞ మండ్లెం శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం ☞ ఆళ్లగడ్డ ఎస్సై వేధింపులతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.!☞ గోవింద పల్లెలో ఫ్యాక్షన్ పడగ.! ☞ వైసీపీ కన్వీనర్ ప్రతాప రెడ్డికి కాటసాని పరామర్శ ☞ రైలులో ప్రయాణించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ☞ బనగానపల్లెలో మంత్రి బీసీ విస్తృత పర్యటన ☞ జిల్లాలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ☞ శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో రెండు చిరుత పులుల సంచారం
Similar News
News April 7, 2025
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి 75 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
News April 7, 2025
గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసిన పవన్

గర్బిణులు పౌష్టికాహార కిట్లను సద్వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. డుంబ్రిగుడ(M) పెదపాడు గ్రామ సందర్శనలో భాగంగా గ్రామంలో ఉన్న గర్భిణులకు సీమంతం, శిశువులకు అన్నప్రాసన చేశారు. వారికి బాల సంజీవని కిట్లు, గుడ్లు, పప్పు, నూనె, రైస్, చిక్కీలను పవన్ పంపిణీ చేశారు. పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మీ, సీడీపీఓ నీలిమ తదితరులు ఉన్నారు.
News April 7, 2025
రాచువారిపల్లెలో విద్యుత్ షాక్తో రైతు మృతి

పుట్టపర్తి మండలంలోని రాచువారి పల్లి గ్రామ సమీపంలో విద్యుత్ షాక్తో రైతు నంబూరి ప్రసాద్ మృతి చెందాడు. సోమవారం గ్రామ సమీపంలోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నియంత్రిక వద్ద ఫీజు ఎగిరిపోవడంతో దానిని వేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ కావడంతో అక్కడికక్కడే మృతి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు.