News April 6, 2025

నేగు మచిలీపట్నంలో శ్రీరామ శోభాయాత్ర

image

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈనెల 6వ తేదీన మచిలీపట్నంలో శ్రీరామ శోభా యాత్రను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక హిందూ కాలేజ్ నుంచి కోనేరు సెంటర్ వరకు నిర్వహించే ఈ శోభాయాత్రలో అశేష భక్తజనులు పాల్గొనున్నారు. శోభాయాత్ర కమిటీ ప్రతినిథులు ప్రజా ప్రతినిథులు, అధికారులు, నగర ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. 

Similar News

News April 17, 2025

కృష్ణా: ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పుడంటే.! 

image

దీపం 2 పథకంలో భాగంగా 2025-26లో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు దరఖాస్తు చేయాలని జేసీ గీతాంజలి శర్మ తెలిపారు. ఈ ఏడాది మూడు విడతల్లో సిలిండర్‌లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్-జులైలో మొదటిది, ఆగస్టు-నవంబర్‌లో రెండోది, డిసెంబర్-మార్చిలో మూడోది ఉచితంగా అందించనున్నారు. గతేడాది 3,60,500 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 59,333 పంపిణీ చేశారు. 

News April 17, 2025

గన్నవరం: నేడు వంశీ బెయిల్ పిటిషన్‌లపై విచారణ

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

News April 17, 2025

కృష్ణా: జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు 

image

ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మీడియా ప్రతినిధులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ కప్‌ను ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ‘అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్’ పోటీలు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ఏసీఏ స్టేడియంలో జరగనున్నాయి. టోర్నీలో 10 మీడియా జట్లు పాల్గొంటున్నాయి. ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 

error: Content is protected !!