News May 11, 2024
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు మరో 2 రోజులు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోపాటు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనజీ జిలానీ సమూన్ తెలిపారు.
Similar News
News April 11, 2026
శ్రీకాకుళం: యాక్సిడెంట్.. కానిస్టేబుల్ మృతి

నందిగాం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని సీహెచ్.గోపాల్ (40) అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఈయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మద్దిలవానిపేట గ్రామ జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరగగా అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News April 11, 2026
టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి తిలక్‌కు పోలీసుల నోటీసులు

టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి పేరాడ తిలక్‌పై శుక్రవారం టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలిలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేదం ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా గురువారం రాత్రి టెక్కలిలో వైసీపీ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేయడంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు విచారణకు శనివారం తిలక్ హాజరుకావాలని నోటీసులు అందించారు.