News March 31, 2025
నేటితో ముగియనున్న కొమ్మాల జాతర

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హోలితో ప్రారంభమై ఉగాది పండగ సందర్భంగా నేడు కొత్త సాలుతో ముగుస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
శ్రీలంకలో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని శ్రీలంకకు చేరుకున్నారు. ఆయనకు కొలంబో ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ ద్వీప దేశ అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే బాధ్యతలు స్వీకరించాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. 3 రోజుల విజిట్‌లో రక్షణ, ఇంధన, హెల్త్, వాణిజ్య రంగాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
News April 4, 2025
చరిత్ర సృష్టించాడు!

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లతో సత్తా చాటారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఫైఫర్ తీసిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. 4 ఓవర్లలో 36 పరుగులకు పూరన్, పంత్, మార్క్‌రమ్, మిల్లర్, ఆకాశ్ దీప్ వికెట్లను తీశారు. ఆయన టీ20 కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.
News April 4, 2025
వరంగల్ CGHSకు సిబ్బందిని నియమించండి: ఎంపీ కావ్య

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్‌తో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్ మంజూరైనప్పటికీ వైద్య అధికారులు, పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని రోలి సింగ్‌కు వివరించారు. CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.