News May 11, 2024

నేటితో ముగియనున్న ప్రచారాలు

image

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మే 13న ఓట్లు వేసేందుకు జిల్లాలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి వసతి, వికలాంగులకు వీల్ ఛైర్లను ఏర్పాటు చేశామన్నారు. శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చునని వెల్లడించారు.

Similar News

News February 11, 2026

బకాయిల వసూలుపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో GST అమలుపై కలెక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలపై కఠినంగా వ్యవహరించి, వాటిని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్ 51 ప్రకారం ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు GST రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. ప్రతీ నెల 20వ తేదీ లోపు రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలన్నారు.

News February 11, 2026

ఈ నెల 13న మందకృష్ణ మాదిగ రాక

image

కౌతాళం మండలం హాల్వి, గుడికంబళి గ్రామాలలో ఈ నెల 13న బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MRPS జిల్లా ఇన్‌ఛార్జ్ దుమ్ము చిన్న వెంకటేశ్వర్లు మాదిగ, MSP జిల్లా అధికార ప్రతినిధి జి.ఆనంద్ చైతన్య మాదిగ తెలిపారు. కార్యక్రమానికి MRPS వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఇవాళ గోనెగండ్లలో అందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

News February 11, 2026

ప్రజల భద్రత మరింత పటిష్ఠం

image

కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టిన డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల భద్రత మరింత పటిష్ఠం కానుంది. డే, నైట్ విజన్ సౌకర్యాలు కలిగిన డ్రోన్ కెమెరాలతో పగలు, రాత్రి నిరంతరం నిఘా పెట్టనున్నారు. దీంతో నేరాలు ముందే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. మహిళల భద్రతకు నియంత్రణ, కాలేజీలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని గుర్తించే అధునాతన సాంకేతికను జోడించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.