News February 28, 2025

నేటితో ముగియనున్న రామప్ప జాతర

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు(రామప్ప జాతర) నేటితో ముగియనున్నాయి. నేడు స్వామివారికి నాగబలి, గెలుపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలకు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు.

Similar News

News November 21, 2025

NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

image

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఈ టోర్నీలు జరగ లేదు.

News November 21, 2025

ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్దిపేట కవి

image

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన కవి, రచయిత ముక్కెర సంపత్ కుమార్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో ఏపీలోని గుంటూరులో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంపత్ ఎంపికయ్యారు. ఈ మేరకు సరస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక పంపించారు. ఈ సభల్లో దేశ, విదేశాలకు చెందిన కవులు పాల్గొననున్నారు.

News November 21, 2025

హనుమాన్ చాలీసా భావం – 16

image

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా ||
హనుమంతుడు నిస్సహాయ స్థితిలో ఉన్న సుగ్రీవునికి గొప్ప ఉపకారం చేశాడు. అతనికి శ్రీరాముడిని పరిచయం చేసి, ఆ మైత్రి ద్వారా కోల్పోయిన రాజ్యపదవిని తిరిగి ఇప్పించాడు. సమయస్ఫూర్తితో, సరైన మార్గదర్శకత్వంతో, నిస్వార్థ స్నేహ బంధాన్ని ఏర్పరచి ధర్మ సంస్థాపనకు తోడ్పడ్డాడు. ఆపదలో ఉన్నవారికి సాయపడే ఆంజనేయుడి నిరతి అందరికీ ఆదర్శం. <<-se>>#HANUMANCHALISA<<>>