News February 20, 2025
నేటితో ముగియనున్న లింగమంతుల స్వామి జాతర

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఇవాళ్టితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు లక్షలాది భక్తుల పూజలు అందుకున్న లింగమంతుల స్వామి జాతర మకర తోరణం తీసుకువెళ్లడంతో ముగుస్తుందని యాదవ పూజారులు తెలిపారు. అదేవిధంగా చౌడమ్మ, లింగమంతుల విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను తీసుకొని మెంతబోయిన, గొర్ల వంశీయులు సూర్యాపేట మండలం కేసారం బాట పట్టారు.
Similar News
News December 1, 2025
ADB: గొంతు ఎత్తాలి.. నిధులు తేవాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలైనా గోడం నగేశ్ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాసర ఆలయ అభివృద్ధి, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, సిర్పూర్, మంచిర్యాల రైల్వే లైన్లో కొత్త రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్లో అభివృద్ధిపై చర్చించాలి. పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరాలి.
News December 1, 2025
జనగామ: ప్రచారానికి ఏడు రోజులే..!

గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థుల హడావుడి మొదలైంది. ప్రచారానికి ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు 7 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ పూర్తయ్యాకే ప్రచారం నిర్వహిస్తారు. కానీ సమయం లేకపోవడంతో పట్టణాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన ఓటర్లకు ఫోన్లు చేసి ఓట్లు వేసి పోవాలని మచ్చిక చేసుకుంటున్నారు.
News December 1, 2025
గట్టు: బాండ్ పత్రంపై మేనిఫెస్టో విడుదల

గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు చేసిన ప్రకటన జిల్లాలో చర్చనీయాంశమైంది. గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆయన వంద రూపాయల బాండ్ పత్రంపై విడుదల చేశారు. తాను ఎన్నికైతే ఈ హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పడం వైరల్ అయ్యింది.


