News January 20, 2025
నేటితో ముగియనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 31న వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 20 రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు అవతారాల్లో రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. జనవరి 26న విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవ కేవలం భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం.
Similar News
News December 22, 2025
సీఎస్ఎల్ ఆఫీసులో పొంగులేటి ఆకస్మిక తనిఖీ

భూపరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా అందించడానికి రెవెన్యూ స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలు ఒకే ఫ్లాట్ ఫామ్ మీదకు తెచ్చి భూ భారతి పోర్టల్‌కు అనుసంధానం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లిలోని సీఎస్ఎల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
News December 22, 2025
ఖమ్మంలో ఈనెల 24న జాబ్ మేళా

ఖమ్మం టీటీడీసీ భవనంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ హ్యుందాయ్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత గల 24-35 వయస్సు గల యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు విద్యార్హత పత్రాలతో ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.
News December 22, 2025
ఖమ్మంలో రెవెన్యూ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నికలలో చోటుచేసుకున్న ఏకగ్రీవ ఫలితాలతో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. ఉద్యోగుల మధ్య ఉన్న బలమైన ఐక్యత, సమన్వయాన్ని ఈ ఫలితాలు చూపుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్, నియామక, శిక్షణతో సంబంధిత చర్యలు తీసుకుంటామని, కొత్తగా చేరిన ఉద్యోగులకు అవగాహన, ప్రాయోగిక శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్, సభ్యులు ఉన్నారు.


