News April 10, 2024
నేటితో ముగియనున్న NEET(UG) రిజిస్ట్రేషన్ గడువు
దేశవ్యాప్తంగా MBBS, BDSకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-2024) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. రాత్రి 11:50 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్ ఫీజు చెల్లించవచ్చని NTA పేర్కొంది. గత నెల 16న రిజిస్ట్రేషన్ గడువు ముగియగా, తాజాగా మరోసారి రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలిపింది.
Similar News
News November 15, 2024
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించింది. ఇవి భూమితో పాటు సముద్ర జలాల్లో వివిధ రేంజ్లలో ఉన్న శత్రువులను సైతం ఛేదించగలవు. వీటిని ఇప్పటికే ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో ఉపయోగించారు.
News November 15, 2024
GREAT: చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు
AP: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలు దానం చేసి పేరెంట్స్ నలుగురి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది. మన్యం(D) కొత్తవలసకు చెందిన సాయికుమార్(22) బైక్పై ఇంటికొస్తూ కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడిని VZM ఆస్పత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల సమ్మతితో కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను విశాఖకు తరలించి నలుగురికి అమర్చారు.
News November 15, 2024
లగచర్ల కేసు నిందితులతో కేటీఆర్ ములాఖత్
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న వారితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న 16 మంది నిందితులను పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 500 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.