News May 11, 2024
నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Similar News
News April 18, 2026
ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు
News April 17, 2026
ఖమ్మం: బియ్యం అక్రమ రవాణాదారుపై పీడీ యాక్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ సునీల్ దత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ఖమ్మంలో 13 కేసులతో పాటు ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయని, అతడిని చంచలగూడ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
News April 17, 2026
నిర్మాణ కార్మికుల కూలీ పెంపు: ఉప కార్మిక కమిషనర్

ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల కూలీ రేట్లను 10 శాతం పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చల్లో బిల్డర్లు, యూనియన్లు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం మేస్త్రీ కూలీ రూ.1,050, సహాయకుల కూలీ రూ.735 కు చేరింది. మే 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.


