News December 23, 2024

నేటితో 136వ వసంతంలోకి సింగరేణి

image

సింగరేణి అంచెలంచలుగా ఎదుగుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. నేడు 135 వసంతాలు పూర్తిచేసుకుని 136వ వసంతంలోకి అడిగెడుతోంది. రామగుండంలో 1937 సంవత్సరంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొదటగా హైదరాబాద్ దక్కన్ కంపెనీతో ఏర్పాటైన ఈ సంస్థ.. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు. అప్పటినుంచి ప్రతియేటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 24, 2024

ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో టెండర్లకు ఆహ్వానం

image

ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వివిధ అంశాలపై టెండర్ నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారులు తెలిపారు. ఆలయంలోని టెంకాయలు, గుమ్మడికాయలు, కిరాణా షాపులు, వాహన పార్కింగ్ లైసెన్స్ హక్కు, కూల్ డ్రింక్స్, పూల దండలు, తల్లి ఆరాధన లైసెన్స్ హక్కు సహ పలు వాటికి ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల నాయకులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. @ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. @ కరీంనగర్ ప్రజావాణిలో 333, సిరిసిల్ల ప్రజావాణిలో 142 ఫిర్యాదులు. @ ట్రాఫిక్ పోలీస్ విధులలో చేరిన ఎండపల్లి మండల ట్రాన్స్ జెండర్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి. @ బాధ్యతలు స్వీకరించిన మెట్పల్లి, మల్లాపూర్ నూతన ఎంపీడీవోలు.

News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

☞JGTL: డ్రైనేజీలో పడేసి బండరాళ్లతో యువకుడు పై దాడి ☞JMKT: గుంపుల క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు☞మల్లాపూర్: బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష☞కమలాపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు ☞మద్దికుంటలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య ☞వీణవంక: చల్లూరు లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని వ్యక్తి మృతి☞మంథనిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా