News August 23, 2024
నేటి గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభించనున్న గ్రామ సభలను, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తమిమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గ్రామసభల సంసిద్ధతపై కలెక్టర్ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నేటి గ్రామ సభలలో మండలాధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News November 10, 2025
ప్రకాశమంతా ఒకటే చర్చ.. ఆ ప్రకటన వచ్చేనా?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా ప్రకటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు నేడు నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా, శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో విలీనం చేస్తారా? లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
News November 10, 2025
ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.
News November 9, 2025
వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.


