News February 19, 2025

నేటి జగిత్యాల మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ పంటల ధరలు ఇలా ఉన్నాయి.. కందులు క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 7,096, కనిష్ఠ ధర రూ. 4,559 లుగా పలికాయి. అనుముల ధరలు రూ. 4,559 నుండి రూ. 6,900 మధ్య ఉన్నాయి. పల్లికాయ రూ. 2,851లుగా పలికాయి. మక్కలు రూ. 1,955 నుండి రూ. 2,222 మధ్య పలికాయి. వరి ధాన్యం (JSR) రూ. 2,621లుగా పలికాయి. కాగా ఈరోజు మొత్తం 97 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.

Similar News

News March 28, 2025

MBNR: రాజీవ్ యువ వికాసం.. APPLY చేసుకోండి..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హులైన బీసీ నిరుద్యోగ యువత “రాజీవ్ యువ వికాసం పథకం”ను ఆన్‌‌లైన్‌లో ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా యువత ఉపాధి రుణాలు పొందవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2న ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తోందన్నారు. ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT

News March 28, 2025

MBNR: గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9.21 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాటిని మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ఉగాది రోజు ప్రారంభించనున్నారు.

News March 28, 2025

MBNR: ఎల్ఆర్ఎస్‌కు గడువు మూడు రోజులే… 51,490 దరఖాస్తులు

image

LRS దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు 3రోజుల్లో ముగియనుంది. కానీ దరఖాస్తులేమో 51,490 పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుల్ని పరిష్కరించుకునే వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తుదారుల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. వీరికి అవకాశం కల్పిస్తే తమకు ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. MBNRలో 29,390, జడ్చర్ల 16,500, భూత్పూర్ 5,600 ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.

error: Content is protected !!