News March 27, 2025
నేటి నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర

అనకాపల్లి పట్టణం తాకాశివీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి జాతరను గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ టి.రాజేష్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. 28 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కొత్త అమావాస్య జాతర జరుగుతుందన్నారు. జాతరలో నేలవేషాలు, స్టేజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసామన్నారు.
Similar News
News November 5, 2025
‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.


