News April 14, 2025
నేటి నుంచి అల్లాదుర్గం బేతాళస్వామి జాతర

అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం.
Similar News
News April 10, 2026
మాసాయిపేట: గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్క.. తొలగించిన వైద్యులు

విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కుగా వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసి తొలగించారు. మాసాయిపేట మండలం హకీంపేట గ్రామానికి చెందిన మల్లయ్య తూప్రాన్‌లో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యాడు. విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడకుండా పడిపోయాడు. తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సూపరింటెండెంట్ అమర్ సింగ్ తీవ్రంగా శ్రమించి గొంతులో ఇరుక్కున్న ముక్కను తొలగించారు.
News April 10, 2026
రామాయంపేట: సైకిల్ పై నుంచి కిందపడి రైతు మృతి

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్‌కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 10, 2026
కన్నవారు లేకున్నా.. చెల్లెళ్లకు అమ్మగా మారిన ‘లావణ్య’.

13 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లల జీవితాల్లో పెద్దక్క లావణ్య వెలుగులు నింపింది. మెదక్ జిల్లా రామాయంపేటకి చెందిన బైరం యాదగిరి-రాజమణి దంపతులు మృతి చెందగా, చిన్న వయసులోనే ఇంటి బాధ్యతను లావణ్య భుజాన వేసుకుంది. కన్నీటిని దిగమింగి, అమ్మానాన్న లేని లోటు తెలియనీయకుండా తన ఇద్దరు చెల్లెళ్లు ప్రియాంక, పూజలను ఒక తల్లిలా సాకి ఉన్నత చదువులు చదివించింది. # నేడు సిబ్లింగ్స్ డే


