News July 31, 2024

నేటి నుంచి ఆగస్టు 5 వరకు లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

తాడేపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమం బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రద్దు చేసినట్లు మంగళవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగే సమయం, తేదీలను ప్రకటిస్తామని, ప్రజలు సహకరించాలని వారు ఆ ప్రకటనలో కోరారు.

Similar News

News October 24, 2025

గుంటూరు డీఈవోపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం

image

గుంటూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించారు. దీంతో డీఈవో రేణుక తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 24, 2025

చిచ్చర పిడుగు.. 17 ఏళ్లకే ప్రపంచ మేధావిగా గుర్తింపు

image

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి కరెక్ట్‌గా సూటవుతుంది ఈ కుర్రాడికి. 4 ఏళ్ల వయసులో కంప్యూటర్‌పై పట్టు సాధించి 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్, 17 ఏళ్లకి Ai ఇంజినీర్‌గా రాణిస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అతడే ఆసియాలోనే యంగెస్ట్ డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్ద్ శ్రీ వాత్సవ. తెనాలి ఐతానగర్‌కు చెందిన ప్రియమానస, రాజకుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్ద్ నేడు టోరీ రేడియో లైవ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు.

News October 24, 2025

సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

image

ప్రజలకు సైబర్ నేరాలు, మోసాల పట్ల అవగాహన కల్పించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రామ/ వార్డు మహిళా పోలీసులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు.