News July 23, 2024

నేటి నుంచి ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు: కలెక్టర్

image

ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ చెప్పారు. ఆధార్‌ క్యాంపులను క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. అలాగే చిన్న పిల్లలకు నూతన ఆధార్‌ కార్డుల జారీ, 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఆధార్‌ బయోమెట్రిక్‌, 18ఏళ్ల పైబడిన వారి ఆధార్‌ అప్డేడేషన్‌ను విరివిరిగా చేపట్టి ఆధార్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు.

Similar News

News July 9, 2025

నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

image

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News July 9, 2025

ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..!

image

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపాయి. తెలుగు మహిళలు పలుచోట్ల ఆందోళనలు చేసి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న ఉదయం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రసన్నపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనపై హత్యాయత్నం చేశారని ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

News July 9, 2025

నల్లపురెడ్డిపై మహిళా కమిషన్ ఫిర్యాదు

image

YSRCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజను కలిసి కార్పొరేటర్ ఉషారాణి ఫిర్యాదు చేశారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు దౌర్జన్యంగా ఉన్నాయని విమర్శించారు. నల్లపురెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.